Saturday, December 13, 2008

రెక్కలు

బొమ్మల్లో
ప్రపంచం
ఆటల్తో
ఆనందం



సుందర స్వప్నం
బాల్యం.......................................................................27.



---------------------------------------------------------------------------------------------

అంతులేని
అనుభవాలు
మరువలేని
అనుభూతులు


గుప్పెడంత గుండెకు
బోలెడన్ని చప్పుళ్ళు...........................................28.


----------------------------------------------------------------------------------------------

Thursday, December 11, 2008

రెక్కలు

నవ్వుతూ
నవ్వించేవారు
భూమిపైనున్న
చందమామలు


పంచేకొద్దీ పెరుగుతుంది
సంతోషం..................................................26.

------------------------------------------------------------------------------------------------

నవ్వటం వరం

నవ్వలేకపోవటం జ్వరం

నవ్వు నటించటం కష్టం

నవ్వించగల్గటం అదృష్టం



నవ్వి నొప్పించటం పాపం

నవ్వుల పాలు కావటం శాపం........................25.

రెక్కలు

నచ్చినట్టు
నిన్ను
నీకు
చూపిస్తుంది



అన్నిటికంటే అందమైనది
అద్దం.....................................23.



-------------------------------------------------------------------------------------





ఎవరేమన్నా
ఏమనుకున్నా
దారితెలిసినవాడు
వెనుదిరగడు



నీకు నువ్వే
గొప్ప పరిశీలకుడివి.......................24.


-------------------------------------------------------------------------------------------------

Wednesday, December 10, 2008

రెక్కలు

ఎటుచూసినా

తేనె

పూసిన

కత్తులే



ప్రశ్నించేవాడెప్పుడూ

పిచ్చోడే ! ............................ 16.

----------------------------------------------------------------------------------------------


లేనివాడికి

దొరకదు

ఉన్నవాడికి

అరగదు



జానెడు పొట్టకు

బోలెడు తిప్పలు .................... 17.


----------------------------------------------------------------------------------------------------


కోట్లు

కూడబెట్టి

కునుకులేని

బ్రతుకు


బూడిదలో

పన్నీరు ................... 18.



-------------------------------------------------------------------------------------------------


పేదరికంపై

పెత్తనం

అమాయికత్వంపై

ఆధిపత్యం



పనిమనిషీ

మనలాంటి మనిషే ! ..................19.


-----------------------------------------------------------------------------------------


మనసు

గుప్పెడు

ఆశ

గంపెడు



విషవృక్షం

దురాశ .....................20.


------------------------------------------------------------------------------------------------

'నా'నుండి

చూస్తే

అన్నీ

న్యాయాలే



తారుమారైన

తప్పొప్పులు 'నా - నీ' లు. ...................21.


-----------------------------------------------------------------------------------------------


గోరుముద్దల్లో

కోటిసుద్దులు

జోలపాటల్లో

శతకోటి ఆశలు



అమృత భాండాగారం

అమ్మ !!!! ..............................22.


-------------------------------------------------------------------------------------------------


రెక్కలు

వేలాది
సైన్యం ఓ ప్రక్క
తోడుగా
నేస్తం మరోప్రక్క


సైన్యం వెనుదిరిగినా
స్నేహం నిన్ను వీడదు.............................. 6.





స్నేహితుడే
అయినా
చెయ్యి
చాచకు





నీ ’ఇన్ ’ధనం
ఆత్మాభిమానం......................................... 7.






నీలో తాను
తనలో నీవు
మనుషులిద్దరు
ఆలోచన ఒక్కటి


ఒకే దారిలో పయనిస్తుంది
నిజమైన స్నేహం......................................8.




చెయ్యిచాపటం
సులువు
స్నేహం నిలుపుకోవటం
కష్టం


అవాంతరాల్ని అధిగమించేదే
అసలైన స్నేహం.....................................9.






చెడుకు
చేరువవ్వటం
మంచికి
దూరమవ్వటం



పూడ్చలేని
అగాథాలు.................................................10.







కొనుక్కున్న
సన్మానాలు
అనవసరపు
ఆర్భాటాలు


ఖాళీ డబ్బాలో
రాళ్ళమోతలు...............................11.





తియ్యగా
మాట్లాడుతూ
చుట్టుకుంటాయి
ఎన్నెన్నో బంధాలు



ఇందరిలో
నీ వారెందరో ?.......................................12.








స్వప్నాలకి
చిరునామా
విశ్రాంతికి
వీలునామా

ఖర్చులేని రీచార్జ్
నిద్ర.......................................................13.






దాస్తే
దాగదు
ప్రతి కదలికా
బైటపడేస్తుంది

ఛీత్కారాలు, జేజేలు
వ్యక్తిత్వానికే................................14.





నీ పై నీకు
నమ్మకాన్ని
గౌరవాన్ని
నాటినవాడు



కల్పతరువు
గురువు..........................................15.

రెక్కలు

పెదవి దాటాక
నీ మాటలే
నీపై తిరుగుబాటు
చెయ్యగలవు



ఆయుధాల్ని
జాగ్రత్తగా ప్రయోగించాలి 1.





అంతస్థుల్లో
బందీలకి
స్నేహమంటే
స్వార్థం



స్నేహితులు లేకపోవటం
ఆగర్భ దారిద్ర్యం 2.





ఆదిలో
ఆరాటం
ఆతర్వాత
తిరస్కారం



నకిలీ స్నేహాలు
కలకాలం సాగవు 3.






కోరుకున్నవన్నీ
దక్కవు
ప్రాప్తమున్నవేవీ
ఆగవు.



ధీమా నీపాలిట
కల్పవృక్షం 4.



చప్పట్లు
సత్కారాలు
మనస్పూర్తిగా
రావాలి



బలవంతంగా వచ్చేవి
బలిపశువులు 5.





తెలుగుకళ - పద్మకళ.