Wednesday, March 25, 2009

రెక్కలు - ప్రోత్సాహం

వెన్నుతట్టే
వారుంటే
వెనకడుగు వేసే
ప్రశ్నే లేదు



లెక్కలేనన్ని ఆవిష్కరణలకు నాంది~
ఒక్క ప్రోత్సాహం

Monday, March 9, 2009

రెక్కలు - (బాల్య వివాహాలు, నిజం, స్త్ర్రీ, పనిమంతులు.....)

ముక్కుపచ్చలారందే
పచ్చతాడు
బంగరు కలల జీవితానికి
బలితాడు

తుంపేసిన పచ్చి మొగ్గలు~
వికసించవు


----------------------------------



చెప్పేవాళ్ళందరూ
చెయ్యరు
చేసేవాళ్ళందరూ
చెప్పరు

చేసిచూపిస్తారు~
చేవ ఉన్నవాళ్ళు

--------------------------------------------------


త్రవ్వినా
భరించే ధరిత్రి
తన్నినా
తట్టుకునే స్త్రీమూర్తి


సహనం తో~
విజయం

---------------------------------------------------

నోరు
నిజం చెప్పకున్నా
కళ్ళు
అబద్ధమాడలేవు

ప్రతి అబద్ధాన్నీ బైటపెడ్తుంది~
ఓ నిజం

-------------------------------------------------------

Saturday, February 21, 2009

రెక్కలు - చెట్టు

విత్తువేసేది
ఒకరు
పండు తినేది
మరొకరు


ఒక్క చెయ్యి ~
ఎన్నో కడుపుల్ని నింపగలదు.

---------------------------------------

Sunday, February 15, 2009

ఫిబ్రవరి 15- రెక్కలకళ

శతృవుతో
ఆనందం
మితృడి తో
ఆవేదన

పంచుకునే పెద్దమనసులకి
బోలెడు బంధాలు



------------------------------------------------------------

Saturday, February 7, 2009

వేలాదిసైన్యం

ఓ ప్రక్క

తోడుగా నేస్తం

మరోప్రక్క


సైన్యం వెనుదిరిగినా

స్నేహం నిన్ను వీడదు....................................49.

-----------------------------------------------------------------

స్నేహితుడే

అయినా

చెయ్యి

చాచకు



నీ ’ఇన్ ’ధనం

ఆత్మాభిమానం.......................................50.

--------------------------------------------------------------------------------------------



నీలో తాను

తనలో నీవు

మనుషులిద్దరు

ఆలోచన

ఒక్కటి



ఒకే దారిలో పయనిస్తుంది

నిజమైన స్నేహం................................51.


-----------------------------------------------------------------------

చెయ్యిచాపటం

సులువు

స్నేహం నిలుపుకోవటం

కష్టం



అవాంతరాల్ని అధిగమించేదే

స్నేహం...............................52.



-------------------------------------------------------------------------

చెడుకు

చేరువవ్వటం

మంచికి

దూరమవ్వటం


పూడ్చలేని అగాథాలు

తప్పుడు నిర్ణయాలు..............................................53.



-----------------------------------------------------------------------------------------



కొనుక్కున్న

సన్మానాలు

అనవసరపు

ఆర్భాటాలు



ఖాళీ డబ్బాలో

రాళ్ళమోతలు...........................54.



----------------------------------------------------------------------------

తియ్యగా

మాట్లాడుతూ

చుట్టుకుంటాయి

ఎన్నెన్నో బంధాలు



ఇందరిలో

వారెందరో ?.....................................55.

------------------------------------------------------------------------


స్వప్నాలకి

చిరునామా

విశ్రాంతికి

వీలునామా



ఖర్చులేని రీచార్జ్

నిద్ర......................56.



----------------------------------------------------------------------------


దాచినా

దాగదు

ప్రతి కదలికా

బైటపడేస్తుంది



ఛీత్కారాలు, జేజేలు

వ్యక్తిత్వానికే...............................57.



-----------------------------------------------------------------------------



నీ పై నీకు

నమ్మకాన్ని

గౌరవాన్ని

నాటినవాడు



కల్పతరువు

గురువు.......................................58.

పెదవి దాటాక
నీ మాటలే
నీపై తిరుగుబాటు
చెయ్యగలవు
జాగ్రత్తగా ప్రయోగించాలి
ఆయుధాల్ని...................................44.
------------------------------------
అంతస్థుల్లో
బందీలకి
స్నేహమంటే
స్వార్థం
ఆగర్భ దారిద్ర్యం
స్నేహితులు లేకపోవటం.............................................45.
-----------------------------------
ఆదిలో
ఆరాటం
ఆతర్వాత
తిరస్కారం
కలకాలం సాగవు
నకిలీ స్నేహాలు....................................................46.
-----------------------------------
కోరుకున్నవన్నీ
దక్కవు
ప్రాప్తమున్నవేవీ
ఆగవు.
నీపాలిట కల్పవృక్షం
ధీమా !.....................................................47.
---------------------------------
చప్పట్లు
సత్కారాలు
రావాలి
మనస్పూర్తిగా
బలవంతంగా వచ్చేవి
బలిపశువులు.........................................................48.

రెక్కల కళ

కూర్చున్న చెట్టుని
నరుక్కోవటం
తల్లిదండ్రుల్ని
అలక్ష్యం చేయటం


అత్యుత్తమ శ్రేయోభిలాషులు
అమ్మా నాన్నలు............................41.


-------------------------------------------------------------------------------------------------



ఒక్క కిరణంలో
సప్త వర్ణాలు
ఒక్క భావనలో
విభిన్న కోణాలు

విశాల గగనం, మహా సాగరం
ప్రేమ ..........................................42.


-------------------------------------------------------------------------------------------------


అమ్మానాన్నల్ని
చూడనివాళ్ళు
కళ్ళున్న
గుడ్దివాళ్ళు


కృతఘ్నత
క్షమించరాని నేరం.....................................43.

--------------------------------------------------------------------------------------------------