Wednesday, October 14, 2009

రెక్కలు… (విజయం)

 

 

వెనక్కి

తగ్గిన

బాణమే

దూసుకెళ్తుంది

 

వెనకడుగైనా ~

విజయానికి  తొలిఅడుగే

 

 

--------------------------------------------

 

ప్రాకులాడటం

అడుగులెయ్యడం

పరుగులు తియ్యడం

ఆయాసపడటం

 

నాలుగు బళ్ల పయనం ~

జీవితం

-------------------------------------------

అనుభవాలు

ఎన్నో

అనుభూతులు

కొన్నే

 

పదిలపరచుకోవాలి ~

మధురస్మృతుల్ని

---------------------------------------------

 

మనుగడ

సాగదు

నాకెందుకులే

అనుకుంటే

 

ప్రశ్నించే దమ్ముండాలి ~

పరిష్కారం కోరేవారికి

---------------------------------------------

Wednesday, September 2, 2009

మనిషి

చేతిలోఉంటే

చులకన చేస్తాడు

చెయ్యిజారాక

నీరుగారిపోతాడు

 

దూరమైతే ~

విలువ పెరుగుతుంది

Monday, July 13, 2009

కొత్తగా రెక్కలు

 

 

డబ్బున్నవాళ్ళందరూ

ధనికులా?

నిరుపేదలందరూ

దరిద్రులా?

 

కోట్లతో కొనలేవు~

వ్యక్తిత్వాన్ని

 

-------------------------------------------------------------

 

 

 

సవాళ్ళని

జయించు

సామర్థ్యాన్ని

బ్రతికించు

 

రెండో చెంప చూపినవాడే ~

చుక్కలు చూపించాడు.

 

 

------------------------------------------         

Monday, June 29, 2009

రెక్కలు…

ఒక్కరు

చెయ్యలేరన్నీ

ఒక్కొక్కరుగా

చెయ్యగలరెన్నో

 

బింధువులన్ని కలిస్తే~

సింధువు

 

 

-------------------------------------

నిన్ను బట్టే

స్నేహాలు

స్నేహితుల్ని బట్టే

ఆశయాలు

 

విత్తు నాణ్యమైన దైతే ~

పంట బంగారమే

Monday, June 15, 2009

రెక్కలు ... (క్షమాపణ)

క్షమిస్తే
దేవుడౌతావు
క్షమాపణ అడిగితే
మనిషివవుతావు


బంధాలు నిలబడాలంటే ~
అహాన్ని వీడాల్సిందే

--------------------------------

Thursday, May 7, 2009

రెక్కలు.... సంకల్పబలం

తలచుకుని
తపిస్తే
అసాధ్యాలన్నీ
సుసాధ్యాలే

చందమామపైకెక్కించింది ~
సంకల్పబలం