Tuesday, December 1, 2009

రెక్కలు …. 91,92,93

నిరాశ

నీడ

ఆశ

కాగడా

 

నీడకు భయపడకుండా ~

వెలుగులో సాగిపో                       91

 

---------------------------------

నిజానికి

ధైర్యం

అబద్ధానికి

తెలివికావాలి

 

బ్రతక నేర్చినా , బ్రతికించుకున్నా ~

నువ్వే                                         92

----------------------------------------------

 

 

మండే

అగ్నిగోళానికీ

తప్పని

గ్రహణం

 

ఎంతవారైనా అప్పుడప్పుడూ ~

రాజీ పడాల్సిందే                              93

 

---------------------------------------------------

1 comment:

  1. మీ కవనపు గువ్వల
    రెక్కల రెపరెపల
    సవ్వడుల నాదాలు
    వీనులకు మృదంగ తాళాలు

    మీ కవితా గీతాలు
    సంగీత స్వరాలు

    ReplyDelete