ముక్కుపచ్చలారందే
పచ్చతాడు
బంగరు కలల జీవితానికి
బలితాడు
తుంపేసిన పచ్చి మొగ్గలు~
వికసించవు
----------------------------------
చెప్పేవాళ్ళందరూ
చెయ్యరు
చేసేవాళ్ళందరూ
చెప్పరు
చేసిచూపిస్తారు~
చేవ ఉన్నవాళ్ళు
--------------------------------------------------
త్రవ్వినా
భరించే ధరిత్రి
తన్నినా
తట్టుకునే స్త్రీమూర్తి
సహనం తో~
విజయం
---------------------------------------------------
నోరు
నిజం చెప్పకున్నా
కళ్ళు
అబద్ధమాడలేవు
ప్రతి అబద్ధాన్నీ బైటపెడ్తుంది~
ఓ నిజం
-------------------------------------------------------
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
చిన్ని కవితల పరిమళ౦
కొన్ని చుక్కల అమృత౦
అన్ని బ౦ధాల అర్ణవ౦
ఎ౦త చక్కని తా౦బూల౦
తమలపాకు పచ్చదన౦
ఆకులోని తెల్లని సున్న౦
కలగలిసి వచ్చే సి౦ధూర౦
రెక్కల్లో అదే ఎర్రచ౦దన౦
మిగులు నీ మాట నిర౦తర౦
పలుకు తేనెలు తర౦తర౦
విరిసి మెరుయును జీవితా౦త౦
వ్యాఖ్య ఎక్కడ పెట్టాలో తెలియలేద౦డీ పద్మకళ గారు ఎ౦దుక౦టే అన్నిటికీ కలిపి పెడదామని అనిపి౦చి౦ది నాకు. అ౦దుకే ఇక్కడ పెట్టి, లోగిలిలో నాకు బాగా నచ్చిన మీ కవితకు పెట్టాను.
Post a Comment