అందరికోసం
నువ్వు
నీకోసం
నువ్వే
ఇస్తాయి కానీ అడగవు ~
చెట్లు 94
-------------------------------------
నేటి
భావాలే
రేపటి
ఆదర్శాలు
ఇవ్వాళ కుంగిన సూర్యుడు ~
రేపు ఉదయించక మానడు 95.
-----------------------------------
మంచైనా
చెడైనా
గుండెల్లో
దాచుకుంటుంది
కాలం ~
ముగింపు లేని పుస్తకం 96.
--------------------------------------------
పలికేవాళ్ళని బట్టి
పదాలు
అర్థం
మార్చుకుంటాయి
కత్తి ఒక్కటే ~
వాడే విధానాలెన్నో 97
-----------------------------------------------------
వెక్కిరింతల్ని
ధిక్కరిస్తేనే
విజయాలు
దాసోహమంటాయి
భయపడితే ~
మరింత భయపెడతారు 98.
--------------------------------------------------------
తలరాత
తలపై లేదు
నరుడి
నాల్కపై ఉంది
మనసుల్ని గెల్చేఆయుధం ~
మాట 99.
-------------------------------------------------
పొగడ్తలతో పాటు
అవమానాల్నీ
ఆస్వాదించగలిగటం
అసలైన గెలుపు
మంచు బిందువులకి పులకించిన పువ్వే~
మండుటెండల్నీ భరిస్తుంది 100.
------------------------------------------------------
2 comments:
mee blog baagundi
మీరెక్కలు రెపరెపలాడాయి భలేగా
Post a Comment