Wednesday, December 10, 2008

రెక్కలు

వేలాది
సైన్యం ఓ ప్రక్క
తోడుగా
నేస్తం మరోప్రక్క


సైన్యం వెనుదిరిగినా
స్నేహం నిన్ను వీడదు.............................. 6.





స్నేహితుడే
అయినా
చెయ్యి
చాచకు





నీ ’ఇన్ ’ధనం
ఆత్మాభిమానం......................................... 7.






నీలో తాను
తనలో నీవు
మనుషులిద్దరు
ఆలోచన ఒక్కటి


ఒకే దారిలో పయనిస్తుంది
నిజమైన స్నేహం......................................8.




చెయ్యిచాపటం
సులువు
స్నేహం నిలుపుకోవటం
కష్టం


అవాంతరాల్ని అధిగమించేదే
అసలైన స్నేహం.....................................9.






చెడుకు
చేరువవ్వటం
మంచికి
దూరమవ్వటం



పూడ్చలేని
అగాథాలు.................................................10.







కొనుక్కున్న
సన్మానాలు
అనవసరపు
ఆర్భాటాలు


ఖాళీ డబ్బాలో
రాళ్ళమోతలు...............................11.





తియ్యగా
మాట్లాడుతూ
చుట్టుకుంటాయి
ఎన్నెన్నో బంధాలు



ఇందరిలో
నీ వారెందరో ?.......................................12.








స్వప్నాలకి
చిరునామా
విశ్రాంతికి
వీలునామా

ఖర్చులేని రీచార్జ్
నిద్ర.......................................................13.






దాస్తే
దాగదు
ప్రతి కదలికా
బైటపడేస్తుంది

ఛీత్కారాలు, జేజేలు
వ్యక్తిత్వానికే................................14.





నీ పై నీకు
నమ్మకాన్ని
గౌరవాన్ని
నాటినవాడు



కల్పతరువు
గురువు..........................................15.

No comments: