నా లక్ష్యాలు, ఆశయాలు వాటి సాధనలో నే పడుతున్న అవస్థలు చూసి మా అమ్మ బంగారు బొమ్మ …. ఆవేశంతో ఆసీస్సులతో
రెక్కలు రాసానంటూ నాకు ఫోన్ చేసి చెప్పింది.
నిజానికి రెక్కల నిర్మాణం పై ఆమెకు అవగాహన లెదు
ఆమె రెక్కల్ని నా తరువాయి పోస్ట్ లో సరిచేస్తాను.
ఆమె భావాల్ని యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను.
--------------------------------------
పట్టినపట్టు
విడువక
పదేపదే
ప్రయత్నించు
ప్రతి దానిలోను
విజయం తప్పక లభిస్తుంది
-----------------------------------
ప్రతి కష్టమూ
నిన్ను ఉన్నత స్థితికి
మార్చేమెట్టుగా
మారిపోవును
ప్రతి మంచి ఆలోచన
నీ మార్గమునకు ప్రకాశము
-----------------------------------------
అసూయకు
మించిన రోగం
ప్రేమకు మించిన
ఔషథం లేవు
సృష్టిని మార్చలెవు
నీ దృష్టి నిమార్చుకో
--------------------------------------------------------------
నువ్వెలా
ఉన్నా
రోజు
గడిచిపోతుంది
రోజంతా మంచిగా సక్రమంగా
గడిచి పోయేలా నడచుకో