పనిలో
అలసట
తీరేది
పనితోనే
అలలకు ~
విరామంతో పనిలేదు 82.
-------------------------------
అనుకూలాల్లో
అందరూ సాధిస్తారు
ప్రతికూలల్లో
గెలిస్తేనే గొప్ప
దిశమార్చుకోదుకనకనే~
ధృవతార అయ్యింది. 83.
------------------------------
చిన్న
పొగడ్త
ఆకాశమంత
ఉత్తేజాన్నిస్తుంది
అందరూ మెచ్చుకోలేరు ~
ఇతరుల గొప్పతనాన్ని 84.
------------------------------------
చిన్న
నిర్ణయాలే
పెనుమార్పులకి
నాందిపలుకుతాయి
మహా వృక్షానికి మూలం ~
చిరు బీజమే 85.
----------------------------------
గాలి వీస్తే
జాబిల్లిని
దాచిన మబ్బులు
పారిపోవాల్సిందే
అర్థం చేసుకునేవారికి ~
మనస్ఫర్థలు మబ్బులు 86.
-------------------------------------
కొందరి బలం
గుంభనం
కొందరి బలహీనత
గలగలలాడటం
పైకైనా , లోనైనా ~
స్వచ్చత అవసరం 87.
------------------------------------------------
నిజమైన
బంధాలకి
ఉండేది
మొదలు మాత్రమే
మధ్యలో వదిలివేసేవారు~
మితృలు కాలేరు 88.
-------------------------------------------------------
పనిలో
దైవాన్ని చూస్తే
భుక్తికి
లోటుండదు
పనిమంతుడి ప్రపంచం ~
సువిశాలం 89.
--------------------------------------------
నీ ప్రశ్నలన్నిటికీ
నీవద్ద
జవాబుందా?
ప్రశ్నించుకో
నిజమైన చికిత్స ~
ఆత్మపరిశీలన 90.
----------------------------------------------------
3 comments:
చాలా బాగున్నాయి.
chalaa baagunnayandi ...
మీ
పదాలు
పదనిసల
స్వరాలు
మా వీనులకొసగు
విందు
Post a Comment