Thursday, February 5, 2009

రెక్కల కళ

నమస్కరిస్తే
నష్టం లేదు
ప్రణమిల్లితే
ప్రాణం పోదు


బేడా ఖరీదు చెయ్యవు
భేషజాలు.............................................37.


---------------------------------------------------------------------------------------------------



కలువకు
జాబిల్లి
తుమ్మెదకి
కుసుమం


పూర్వజన్మ సుకృతం
సజ్జన సాంగత్యం ..................................38.



-------------------------------------------------------------------------------------------------


నదుల లక్ష్యం
సాగర సంగమం
మతాల సందేశం
మహోన్నత జీవనం



అరిష్టాలకు మూలం
మతమౌఢ్యం.............................39.



-------------------------------------------------------------------------------------------------

ప్రాణమిచ్చిన
విధాతలు
ప్రపంచాన్ని చూపిన
వెలుగు రేఖలు



కనిపెంచే దైవాలు
తల్లిదండ్రులు............................................40.

3 comments:

ఆత్రేయ కొండూరు said...

పద్మకళ గారు.. మీ రెక్కలను చూస్తూ, రెప్పలను వాల్చటం మరిచి, ఆలా ఆలోచిస్తు ఉండిపోయానంటే నమ్మండి. చాలా బాగా రాశారు అంటే అది కాస్త తక్కువేనేమో. అభినందనలు

Aditya Madhav Nayani said...

చాలా బాగుంది.. మీ 'రెక్కల కల' అందులొని 'కళ'
అభినందనలు...

శివ చెరువు said...

santhosham.. bahu .. santhosham..